Rahul Comments on Marriage | కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పెళ్లిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఇందులో భాగంగా సోమవారం ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీ (Raebareli)లో రాహుల్ గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి వారితో రాహుల్ సరదాగా ముచ్చటించారు.
ఒకే విమానంలో మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీఆరెస్ నేత ప్రయాణం!
ఈ క్రమంలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని జనంలో నుండి ఒకరు రాహుల్ ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు బదులిస్తూ “ఇప్పుడిక నేను త్వరలోనే పెళ్లి చేసుకోవాలి” అన్నారు రాహుల్.
దింతో సోదరి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi), కాంగ్రెస్ నాయకులు చిరునవ్వులు చిందించారు.