Monday 9th December 2024
12:07:03 PM
Home > తాజా > ఒకే విమానంలో మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీఆరెస్ నేత ప్రయాణం!

ఒకే విమానంలో మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీఆరెస్ నేత ప్రయాణం!

ponguleti srinivas reddy

Congress MLAs in Flight | తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy), కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్ (Tellam Venkatrao), పాయం వెంకటేశ్వర్లు (Payam Venkateswarlu), జారె ఆదినారాయణ (Jare AadiNarayana) మంగళవారం కేరళలోని కొచ్చికి బయలుదేరారు.

కానీ శంషాబాద్ విమానాశ్రయంలో విమానం టేక్ ఆఫ్ తీసుకుంటున్న సమయంలో ఇంజిన్ లో సాంకేతిక లోపం కారణంగా సుమారు రెండున్నర గంటల ఫ్లైట్ ఆలస్యంగా బయలుదేరింది. అయితే ఫ్లైట్ కు రిపేర్ జరుగుతున్న సమయంలో విమానంలోనే ప్రయాణికులు కూర్చున్నారు.

కాగా దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు తెర లేచింది. ఎందుకంటే అదే విమానంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆరెస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohit Reddy) కూడా ఉన్నారు.

ఈ క్రమంలో మంత్రి పొంగులేటి, కాంగ్రెస్ ఎమ్మెల్యే మరియు బీఆరెస్ నేత ఒకే విమానంలో ఎక్కడికి వెళ్తున్నారు అనే చర్చ జోరుగా జరిగింది. అయితే మంత్రి పొంగులేటి మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లినట్లు తెలుస్తోంది.

అలాగే పైలట్ రోహిత్ రెడ్డి కూడా శబరిమల దర్శనానికి వెళ్లినట్లు సమాచారం. కాంగ్రెస్ నేతలున్న విమానంలో తాను ఎక్కడం కేవలం యాదృచ్చికం మాత్రమేనని, తాను కాంగ్రెస్ లో చేరడం లేదని పైలట్ రోహిత్ స్పష్టం చేశారు.

You may also like
ktr
‘సీఎం రేవంత్.. తెలంగాణ తల్లులపై ఏమిటీ దుర్మార్గం?’ : కేటీఆర్
manchu family
మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది.. మోహన్ బాబు ఇంటికి బౌన్సర్లు?
allu amitabh
‘ఐకాన్ స్టార్ మేమంతా మీ అభిమానులమే’: అమితాబ్ బచ్చన్
ponnam prabhakar
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. కేసీఆర్ కు మంత్రి ఆహ్వానం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions