Polling Percentage in Pithapuram | ఆంధ్రప్రదేశ్ (AndraPradesh) లో గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో భారీగా ఓటింగ్ నమోదైంది.
ఇప్పటికే రాష్ట్రంలో 80.66 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena).
ఇదిలా ఉండగా కాకినాడ జిల్లా పిఠాపురం (Pithapuram) నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాగా పిఠాపురం లో రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఈ సారి ఏకంగా 86.33% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: పెళ్లిపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇదే నియోజకవర్గంలో 2014 లో 79.44, 2019 లో 80.92 శాతం పోలింగ్ నమోదు కాగా ఈ సారి ఏకంగా 5 శాతం ఎక్కువగా పోలింగ్ నమోదైంది.
జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇక్కడి నుండి పోటీ చేయడంతో ఈ స్థానం ఆసక్తిగా మారింది. ఇక వైసీపీ (YSRCP) నుంచి వంగా గీత (Vanga Geetha) పోటీచేస్తున్నారు.
ఎన్నికల ప్రచారం చివరి రోజు పిఠాపురంలో పర్యటించిన సీఎం జగన్ మాట్లాడుతూ వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తానని హామీ ఇచ్చారు.
మరి పిఠాపురం ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారో తెలియాలంటే మరో 20రోజుల వేచి చూడాల్సిందే!