Saturday 5th September 2026
12:07:03 PM
Home > తాజా > ‘నిరీక్షణ ముగిసింది’.. ఎక్స్ వేదికగా కొండా సురేఖ సంచలన పోస్ట్!

‘నిరీక్షణ ముగిసింది’.. ఎక్స్ వేదికగా కొండా సురేఖ సంచలన పోస్ట్!

Konda Surekha Sensational Post On X తెలంగాణ మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ సోషల్ మీడియా వేదిక ‘X’ (ట్విట్టర్)లో ఒక సంచలన పోస్ట్ చేశారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ అయిన మరుసటి రోజే ఆమె ఈ ప్రకటన చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

“నిరీక్షణ ముగిసింది… అతి త్వరలోనే పెద్ద నిర్ణయంతో మీ ముందుకు వస్తాను” అని కొండా సురేఖ ఎక్స్‌లో రాసుకొచ్చారు. త్వరలోనే తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై పూర్తి ప్రకటన విడుదల చేస్తానని తెలిపారు. ఆమె తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని అనుచరుల ద్వారా తెలుస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న వరుస వివాదాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే.

You may also like
బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత!
రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి: సీఎం రేవంత్
హైడ్రా పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
saraswati anthya pushkaralu
వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు.. ఎప్పటి నుంచంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions