Friday 8th November 2024
12:07:03 PM
Home > తాజా > పుష్ప 2 ప్రీ రిలీజ్ బిసినెస్..RRRను క్రాస్ చేసిన అల్లు అర్జున్

పుష్ప 2 ప్రీ రిలీజ్ బిసినెస్..RRRను క్రాస్ చేసిన అల్లు అర్జున్

Pushpa 2 Pre Release Business | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Icon Star Allu Arjun ), రష్మిక మందన్న ( Rashmika Mandanna ) జంటగా సుకుమార్ ( Sukumar ) తెరకెక్కిస్తున్న మూవీ పుష్ప 2 ది రూల్. ఫస్ట్ పార్ట్ కి విశేష స్పందన వచ్చిన నేపథ్యంలో పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కేవలం తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ( Fans ) ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో ప్రీ రిలీజ్ బిజినెస్ ( Pre Release Business )విషయంలో పుష్ప 2 గత రికార్డులను తిరగరాస్తున్నట్లు తెలుస్తోంది.

కేవలం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెసే రూ.640 కోట్లు అని టాక్ నడుస్తుంది. రెండు తెలుగురాష్ట్రాల్లో రూ.220 కోట్లు, నార్త్ ఇండియా ( North India ) లో మరో రూ.200 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా మ్యూజిక్ రైట్స్ ( Music Rights ) కోసం రూ.65 కోట్లు, సాటిలైట్ రైట్స్ రూ.85 కోట్లు, ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను రూ.275 కోట్లకు నెట్ఫ్లిక్ ( Netflix )దక్కించుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. మొత్తంగా పుష్ప 2 రూ.1065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు కథనాలు వస్తున్నాయి.

ఇప్పటి వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ లో రూ.900 కోట్లతో రామ్ చరణ్ ( Ram Charan ), ఎన్టీఆర్ ( Jr. Ntr )ల ఆర్ఆర్ఆర్ ( RRR ) ఉండగా ఇప్పుడు పుష్ప-2 ఫస్ట్ ప్లేస్ లోకి దూసుకువచ్చినట్లు తెలుస్తోంది.

You may also like
ఒకే ఫ్రేమ్ లో చిరు, నాగార్జున, మహేష్, చరణ్
పట్టు వస్త్రంపై సీఎం రేవంత్ చిత్రపటం నేసిన సిరిసిల్ల కళాకారుడు
నేను వైఎస్సార్ కు పుట్టలేదన్నారు..వర్రా రవీందర్ పై షర్మిల కన్నెర్ర
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో హోంమంత్రి అనిత భేటీ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions