Saturday 30th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ట్రంప్ విరుచుకుపడుతున్న వేళ..పుతిన్ భారత పర్యటన

ట్రంప్ విరుచుకుపడుతున్న వేళ..పుతిన్ భారత పర్యటన

Russia’s Vladimir Putin Likely To Visit India | రష్యా అధ్యక్షడు పుతిన్ డిసెంబర్ నెలలో భారతదేశంలో పర్యటించనున్నారు. డిసెంబర్ 5, 6 తేదీల్లో ఈ పర్యటన ఉంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఓ వైపు అమెరికా అధ్యక్షుడు సుంకాలతో భారత్ పై విరుచుకుపడుతున్నారు.

అలాగే రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ తో యుద్ధానికి సహకరిస్తుందని ఆరోపణలు చేస్తున్న సమయంలో పుతిన్ భారత పర్యటన ఆసక్తిగా మారనుంది. పర్యటన సందర్భంగా పుతిన్-ప్రధానమంత్రి నరేంద్రమోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. కాగా పుతిన్ భారత్ లో పర్యటిస్తారని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆగస్ట్ నెలలోనే ప్రకటించిన విషయం తెల్సిందే.

అయితే అప్పటికి తేదీలు ఇంకా ఖరారు కాలేదు. ఈ ఏడాది జులైలో ప్రధాని రష్యాలో పర్యటించిన విషయం తెల్సిందే. అనంతరం అక్టోబర్ లో బ్రిక్స్ సదస్సులో భాగంగా కజాన్ వేదికగా ఇరువురు మరోసారి భేటీ అయ్యారు. తాజగా చైనాలో షాంఘై సహకార సదస్సు జరిగింది. ఈ సందర్భంగానూ పుతిన్-మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగింది.

You may also like
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions