SSMB 29 leaked footage of Mahesh Babu | దర్శకధీరుడు రాజమౌళి-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో భారీ బడ్జెట్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.
SSMB29 వర్కింగ్ టైటిల్ తో మూవీ షూటింగ్ జరుగుతోంది. మహేష్ రాజమౌళి కాంబోలో రాబోతున్న తొలి సినిమా పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే మూవీలోని ఓ సీన్ కు సంబంధించిన వీడియో లీక్ అవ్వడం సంచలనంగా మారింది.
వీల్ ఛైర్ లో ఉన్న వ్యక్తి ముందు మహేష్ బాబు మోకాళ్లపై కూర్చోవడం వీడియోలో కనిపిస్తుంది. మరోవైపు భారీ అంచనాల నడుమ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సైతం లీకుల బెడద తగలడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
SSMB29 షూటింగ్ ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎవరో మొబైల్ ఫోన్లో వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. సదరు వ్యక్తుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
అలాగే వీడియో లీక్ అంశాన్ని మూవీ యూనిట్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మహేష్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు.