Barrelakka | కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క అలియాస్ శిరీష (Sirisha) సోదరుడి పై జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న బర్రెలక్క (Barrelakka) విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఆమెకు మద్దతుగా జోరుగా ప్రచారం జరుగుతుంది.
కాగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం లో మంగళవారం నాడు ఇంటింటి ప్రచారం నిర్వహించారు బర్రెలక్క. ఈ సందర్భంగా ఆమె సోదరుడి పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఇక్కడి నుండి వెళ్లిపోవాలంటూ బెదిరించారు.
ఈ నేపథ్యంలో జరిగిన ఘటన పై స్పందించారు మాజీ జేడీ లక్ష్మీనారాయణ (JD Laxmi Narayana).
“తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి శిరీష @బర్రెలక్కకు, ఆమె సోదరుడిపై ఈరోజు జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకుని ఆమెకు, కుటుంబ సభ్యులకు తగిన భద్రత కల్పించాలి.” అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు మాజీ జేడీ.