Thursday 30th July 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘చంద్రబాబు గారు..మీకు చీమ కుట్టినట్లైనా లేదు’

‘చంద్రబాబు గారు..మీకు చీమ కుట్టినట్లైనా లేదు’

Ys Jagan News Latest | ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే ఉద్దేశం ఏ కోశానా చంద్రబాబులో కనిపించడంలేదన్నారు.

ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకాచకా అడుగులేస్తుంటే, వారి కేబినెట్లో వారు ఎత్తు పెంచడానికి ఆమోదం తెలుపుకుంటే, కనీసం ముఖ్యమంత్రి కి చీమకుట్టినట్టైనా లేదని మండిపడ్డారు. అనేక ప్రాంతాలు సాగునీరు, తాగునీరు లేక ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నాసరే ఏమి పట్టనట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృష్ణాజలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా మేలుకొని కేంద్రంలో ఎంపీల సంఖ్యాపరంగా ఉన్న బలాన్ని ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జగన్ డిమాండ్ చేశారు. లేదంటే భావితరాల మనసుల్లో ఆయన చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని కీలక వ్యాఖ్యలు చేశారు.

You may also like
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions