Allu Sirish announces engagement to Nayanika | నటుడు అల్లు శిరీష్ అతి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. నయనిక అనే అమ్మాయితే అక్టోబర్ 31న నిశ్చితార్థం జరగనున్నట్లు శిరీష్ ప్రకటించారు.
బుధవారం దిగ్గజ నటుడు అల్లు రామలింగయ్య జయంతి. ఈ క్రమంలో తన పెళ్లి విషయాన్ని అందరితో పంచుకున్నారు శిరీష్. ఇటీవలే అల్లు అరవింద్ తల్లి కనక రత్నమ్మ మరణించిన విషయం తెల్సిందే. అయితే తన పెళ్లిని కళ్లారా చూడాలని నానమ్మ కోరుకునేది అని పేర్కొన్న శిరీష్, స్వర్గం నుంచి కచ్చితంగా ఆశీర్వదిస్తుందని చెప్పారు. ఇరు కుటుంబాల సమ్మతితో నిశ్చితార్థం జరుపుకొనున్నట్లు ఆయన తెలిపారు.









