Saturday 19th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > RSS శతాబ్ది ఉత్సవాలు..’నాణెంపై తొలిసారి భారతమాత చిత్రం’

RSS శతాబ్ది ఉత్సవాలు..’నాణెంపై తొలిసారి భారతమాత చిత్రం’

PM Modi to Attend RSS Centenary Celebrations in New Delhi | ఢిల్లీలోని బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆరెస్సెస్ ఉత్సవాల నేపథ్యంలో రూ.వంద నాణేన్ని, పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశారు. నాణెంపై ఓ వైపు జాతీయ చిహ్నం మరోవైపు భారతమాత చిత్రం ఉంటుందని ప్రధాని వివరించారు. స్వతంత్ర భారత చరిత్రలో కరెన్సీ పై భారతమాత చిత్రం ఉండడం ఇదే తొలిసారి అని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. అలాగే నాణెంపై ఆరెస్సెస్ నినాదాన్ని ముద్రించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని దేశమే ప్రథమం అని విశ్వసించే ఆరెస్సెస్ కార్యకర్తలు బ్రిటిష్, హైదరాబాద్ నిజాం చేతుల్లో అణిచివేతకు గురయ్యారని తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆరెస్సెస్ నాయకులు జైళ్లకు వెళ్లినట్లు చెప్పారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions