Dimple Hayathi News Latest | హీరోయిన్ డింపుల్ హాయతీ మరియు ఆమె భర్త డేవిడ్ పై హైదరాబాద్ ఫిల్మ్ నగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.
ఒడిశాకు చెందిన ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నటికి మరియు ఆమె భర్తకు నోటీసులు పంపారు. నటిపై ఫిర్యాదు చేసిన యువతి సంచలన ఆరోపణలు చేశారు. షేక్ పేట లోని నటి అపార్ట్మెంట్ లో తాను పనిమనిషిగా ఉద్యోగంలో చేరినట్లు పేర్కొన్న యువతి, తనను దింపుల్ హాయతీ మరియు ఆమె భర్త చిత్రహింసలకు గురి చేశారని దుర్భాశలాడుతూ వేధించారని తెలిపింది.
పని చేయించుకుని డబ్బులు కూడా ఇవ్వలేదని పేర్కొంది. కుక్క అరిచిందనే నెపంతో తనపై దాడి చేశారని ఈ సమయంలో తన దుస్తులను కూడా తొలగించినట్లు ఒడిశా యువతి సంచలన ఆరోపణలు చేసింది. ‘నువ్వు నా చెప్పుతో సమానం’ అని డింపుల్ హాయతీ భర్త రెచ్చిపోయారని సదరు యువతి ఫిర్యాదులో ఆరోపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు.









