Sunday 14th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కేంద్రం కీలక నిర్ణయం.. చౌకగా ఇన్సూరెన్స్ సేవలు!

కేంద్రం కీలక నిర్ణయం.. చౌకగా ఇన్సూరెన్స్ సేవలు!

no gst


No GST On Insurance Policies | ఇన్సూరెన్స్ (Insurance) సేవలను చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత జీవిత బీమా(Life Insurance), ఆరోగ్య బీమా (Health Insurance) పాలసీలను జీఎస్టీ (GST) నుంచి మినహాయించాలని బీజేపీ సర్కారు ప్రతిపాదించింది.

బిహార్‌ ఉప ముఖ్యమంత్రి, బీమాపై ఏర్పాటైన మంత్రుల బృందం (జీఓఎం) కన్వీనర్‌ సామ్రాట్‌ చౌదరి బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై 18 శాతం జీఎస్టీ ఉంది. బీమా జీఓఎం బుధవారం సమావేశమై కేంద్రం తాజా ప్రతిపాదనపై చర్చించింది.

అన్ని రాష్ట్రాల మంత్రులు ఇందుకు సుముఖత వ్యక్తం చేశారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, జీఓఎం సభ్యులు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై జీఎ్‌సటీ మినహాయింపుతో వార్షిక పన్ను రాబడి రూ.9,700 కోట్ల మేర తగ్గే అవకాశం ఉన్నట్లు అంచనా.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions