Monday 4th May 2026
12:07:03 PM
Home > తాజా > ఆసుపత్రిలో ‘జిట్టా’ను పరామర్శించిన హరీశ్ రావు!

ఆసుపత్రిలో ‘జిట్టా’ను పరామర్శించిన హరీశ్ రావు!

harish rao visits jitta balakrishna reddy

Harish Rao Visits Jitta Balakrishna Reddy | తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత జిట్టా బాలక్రిష్ణా రెడ్డి గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

ప్రస్తుతం ఆయన యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు సోమవారం యశోద హస్పిటల్ కి వెళ్లి జిట్టా బాలక్రిష్ణా రెడ్డిని పరామర్శించారు.

ఆయనకు అందుతున్న వైద్య వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. జిట్టా బాలక్రిష్ణా రెడ్డి త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని హరీశ్ రావు వైద్యులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం జిట్టా కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.

హరీశ్ రావు తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఇతర బీఆర్‌ఎస్ నాయకులు జిట్టా బాలక్రిష్ణా రెడ్డిని పరామర్శించారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
harish rao
“ఇది రిక్త హస్తం.. బడా జూటా బడ్జెట్”: హరీశ్ రావు!
harish rao pressemeet
రైతుల నోట్లో మట్టి కొట్టి.. బీరు ఫ్యాక్టరీలకు నీళ్లిస్తారా?
kalvakuntla kavitha
‘కేసీఆర్ సమాచారాన్ని రేవంత్ కు చేరవేసే గూఢచారి ఆయనే’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions