Sunday 8th September 2024
12:07:03 PM
Home > తాజా > జైల్లో నటుడు దర్శన్ రాజభోగాలు..స్పందించిన సీఎం

జైల్లో నటుడు దర్శన్ రాజభోగాలు..స్పందించిన సీఎం

Cm Siddaramaiah On Darshan Jail Viral Photo | అభిమాని రేణుకస్వామి హత్యకేసులో విచారణ ఖైదీగా ఉన్న దర్శన్ ( Actor Darshan ), జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నారు.

బెంగళూరు ( Bengaluru ) లోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న దర్శన్ కాఫీ, సిగరెట్ తాగుతున్న ఫోటో మరియు ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో బయటకు రావడం సంచలనంగా మారింది.

జైలు అధికారుల తీరుపై ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ( Cm Siddaramaiah ) స్పందించారు.

జైల్లో దర్శన్ మరియు ఇతరులకు రాచమర్యాదలు అందించిన ఉదంతాన్ని ప్రభుత్వం సీరియస్ ( Serious ) గా తీసుకుందని స్పష్టం చేశారు. దీనికి బాద్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ ( Suspend ) చేయాలని సీఎం ఆదేశించారు. దర్శన్ తో పాటు ఇతరులను వెంటనే ఇతర జైళ్లకు తరలించాలని సూచించారు. అలాగే జైలును సందర్శించి ఈ ఉదంతం పై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని సీఎం ఆదేశించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions