Tuesday 15th September 2026
12:07:03 PM
Home > తాజా > సీఎం రేవంత్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కోమటిరెడ్డి

సీఎం రేవంత్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కోమటిరెడ్డి

Komatireddy Counter To CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని మరోసారి తప్పుబట్టారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

ఇటీవల ముఖ్యమంత్రి సోషల్ మీడియా జర్నలిస్టులపై విరుచుకుపడ్డ విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి ప్ర‌జ‌ల కోసం సామాజిక బాధ్య‌త‌తో ప‌నిచేస్తున్న సోష‌ల్ మీడియాను పాల‌కులు గౌర‌వించాలే త‌ప్ప‌ అవ‌మానించ‌డం స‌బ‌బు కాదని హితవుపలికారు.

‘తెలంగాణ స‌మాజ‌ ఆకాంక్ష‌ల మేర‌కు సోష‌ల్ మీడియా మొద‌ట్నుంచి త‌న శ‌క్తి కొద్దీ ప‌నిచేస్తూనే ఉంది. నిబ‌ద్ద‌త‌తో ప‌నిచేసే సోష‌ల్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌కు నా మ‌ద్ద‌తు ఎప్పుడూ ఉంటుంది. సోష‌ల్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌ను దూరం పెట్టాలంటూ ప్ర‌ధాన మీడియా వారిని ఎగ‌దోయ‌డం ముమ్మాటికీ విభ‌జించి పాలించ‌డ‌మే. ఇలాంటి కుటిల ప‌న్నాగాల‌ను తెలంగాణ స‌మాజం స‌హించ‌దు.’ అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions