Friday 25th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మహిళల దుస్తుల ఎంపికపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

మహిళల దుస్తుల ఎంపికపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

Delhi High Court Women On Clothing | మహిళల దుస్తుల ఎంపికపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలు ఏమి ధరించాలనేది వారి వ్యక్తిగత నిర్ణయం అని అభిప్రాయపడింది.

జీన్స్ ధరించడం ‘యువకులను చెడగొడుతుందనే’ సూచన తీవ్ర ఆందోళనకరమైన మరియు ఆమోదయోగ్యం కాని మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని ఢిల్లీ హైకోర్టు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.

2013 నాటి ఒక బాలిక లైంగిక వేధింపుల కేసులో విచారణ చేపట్టిన జస్టిస్ చంద్రశేఖరన్ సుధా ఈ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, నిందితుడికి శిక్ష ఖరారు చేశారు.

విచారణలో బాధితురాలి వ్యక్తిత్వ హననంపై కోర్టు ఆగ్రహం

2013లో ఒక బాలికను ఆమె పొరుగువాడు వెంబడించి, లైంగిక వ్యాఖ్యలు చేస్తూ అనుచితంగా తాకాడని ఆరోపణలు వచ్చాయి. 2014లో ట్రయల్ కోర్టు నిందితుడిని నిర్దోషిగా విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.

విచారణ సందర్భంగా నిందితుడి తరఫు న్యాయవాది బాధితురాలి ‘పాశ్చాత్య’ వస్త్రధారణ, ఆ ప్రాంత ప్రజల మతం, దుస్తులపై అభ్యంతరాలు వంటి అంశాలను లేవనెత్తి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

“ఒక మహిళ ఏమి ధరించాలనేది ఆమె ఇష్టం. దానిని నిర్దేశించే హక్కు పొరుగువారికి, సమాజానికి, నిందితుడికి లేదా న్యాయవాదికి లేదు. జీన్స్ ధరించిన మహిళ యువకులను చెడగొడుతుందనడం ఆమోదయోగ్యం కాదు” అని కోర్టు స్పష్టం చేసింది.

అబ్బాయిల ప్రవర్తనపై నియంత్రణ ఉండాలి..

బాలికల దుస్తులను నియంత్రించడం ఈ సమస్యకు పరిష్కారం కాదని జస్టిస్ సుధా ఉద్ఘాటించారు. తల్లిదండ్రులు, సమాజం తమ పిల్లలకు ప్రవర్తనను నియంత్రించుకోవడం, వ్యక్తిగత హద్దులను గౌరవించడం మరియు ప్రతి మనిషిని గౌరవంగా చూడటం నేర్పించాలని హితవు పలికారు.

ఒక మహిళ దుస్తులు, జీవనశైలి ఆధారంగా ఆమె సాక్ష్యాన్ని తోసిపుచ్చలేమని, కేసులో నేరం జరిగిందా లేదా అనేదే ము ముఖ్యమని నొక్కిచెప్పారు. ట్రయల్ కోర్టు నిర్ణయం తప్పని పేర్కొంటూ నిందితుడిని ఐపీసీ (IPC) సెక్షన్ 354A(1)(i) కింద దోషిగా నిర్ధారించి శిక్ష విధించారు.

అయితే ప్రాసిక్యూషన్ వయస్సును స్పష్టంగా నిరూపించకపోవడంతో పోక్సో (POCSO) చట్టం వర్తించదని తెలిపింది.

You may also like
దేశం మీకేం చేసింది కాదు.. మీరేం చేస్తారో ఆలోచించండి: నిర్మలా సీతారామన్
రూ. 5,000 కోట్ల ఆస్తి ఉన్న బీజేపీ ఎమ్మెల్యే.. బిచ్చగాడిలా మారి..!
నాతో కలిసి సాయం చెయ్ సోదరా.. విమర్శలకు సూద్ స్వీట్ రిప్లై!
అర్ధరాత్రి మహిళను రైలు నుంచి దించేసిన రైల్వే.. రూ. 2 లక్షల ఫైన్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions