Friday 25th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > విడాకులైనా పాత పెళ్లి ఫొటోలు భద్రం!

విడాకులైనా పాత పెళ్లి ఫొటోలు భద్రం!

  • రీబౌండ్ సర్వేలో ఆసక్తికర విషయాలు!

Keep Wedding Photos After Divorce విడాకులు తీసుకున్న తర్వాత పాత జ్ఞాపకాలను, ముఖ్యంగా పెళ్లి ఫోటోలను తొలగించడం లేదా నాశనం చేయడమే విడాకుల అసలైన సంకేతం అని అందరూ భావిస్తారు. కానీ, గతంలో వివాహమైన ప్రతి 10 మందిలో ఏడుగురు (70%) ఇప్పటికీ తమ మాజీ (Ex) భాగస్వామితో ఉన్న పెళ్లి ఫోటోలను భద్రంగానే ఉంచుకుంటున్నారట.

విడాకులు పొందిన వ్యక్తుల కోసం పనిచేస్తున్న ‘రీబౌండ్’ (Rebounce) అనే మ్యాచ్ మేకింగ్ యాప్ జరిపిన తాజా సర్వేలో ఈ ఆశ్చర్యకరమైన విషయం వెల్లడైంది.

గత జీవితానికి గుర్తు మాత్రమే..

పెళ్లి ఫోటోలను ఉంచుకోవడం అంటే పాత బంధంలోనే ఉండిపోవడం కాదని 70% మంది తేల్చి చెప్పారు. ముఖ్యంగా పిల్లలు, ఎన్నో ఏళ్ల కుటుంబ చరిత్ర ఉన్నప్పుడు ఆ ఫోటోలు కేవలం గడిచిపోయిన ఒక జీవితానికి సాక్ష్యాలు మాత్రమేనని స్పష్టం చేశారు.

30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న విడాకులు పొందిన వారిలో 36% మంది.. పాత ప్రదేశాలు, సంఘటనలు మరియు జ్ఞాపకాలను ఇప్పటికీ గౌరవిస్తామని చెప్పారు. గతాన్ని మర్చిపోవడం వేరు, కొత్త జీవితంలోకి అడుగుపెట్టడం (Moving On) వేరని వారు తెలిపారు.

‘నో కాంటాక్ట్’ అపోహ..

విడాకుల తర్వాత మాజీ భాగస్వామితో అసలు మాట్లాడకపోవడమే ‘బౌండరీ’ అని భావించడం సరైంది కాదని 47% మంది అభిప్రాయపడ్డారు. పిల్లల చదువులు, ఆస్తులు, చట్టపరమైన వ్యవహారాల కోసం 31% మంది మాజీ భాగస్వాములతో అప్పుడప్పుడూ మాట్లాడుతున్నారని, భావోద్వేగాలపై ఆధారపడకుండా కేవలం ఉమ్మడి బాధ్యతల కోసమే మాట్లాడటంలో తప్పులేదని సర్వే విశ్లేషించింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions