Saturday 26th July 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > హైకోర్టులో అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్

హైకోర్టులో అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్

Big Relief For Allu Arjun In High Court | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Icon Star Allu Arjun ) కు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఎన్నికల సమయంలో అప్పటి వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ( Ravichandra Kishore Reddy )కి మద్దతు ప్రకటించడానికి అల్లు అర్జున్ నంద్యాల వెళ్లిన విషయం తెల్సిందే.

అయితే 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న సమయంలో అనుమతి లేకుండా భారీ జనసమీకరణ చేసారంటూ అల్లు అర్జున్, శిల్పా రవిపై పోలీసులు కేసును నమోదు చేశారు. ఇటీవల ఈ కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్, వైసీపీ ( Ycp ) నేత హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ ( Petition ) పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, నవంబర్ 6 వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 6న తగిన ఉత్తర్వులు ఇస్తామని కోర్టు పేర్కొంది

You may also like
ఇందిరా గాంధీ రికార్డు బ్రేక్ చేసిన నరేంద్రమోదీ
WWE లెజెండ్ హల్క్ హోగన్ మృతి
‘అంబేద్కర్ బాటలోనే కేసీఆర్ ఉద్యమించారు’
‘చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లాప్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions