Saturday 30th May 2026
12:07:03 PM
Home > తాజా > 10 నిమిషాలు ఇల్లు చూసొస్తా..భూదాన్ భూమిలో మహిళ ఆవేదన

10 నిమిషాలు ఇల్లు చూసొస్తా..భూదాన్ భూమిలో మహిళ ఆవేదన

Demolition of houses in Bhoodan lands in Khammam | ఖమ్మంలోని వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో ప్రభుత్వం ఇళ్ల కూల్చివేతలను చేపట్టింది. ప్రభుత్వం ఎవరికీ పట్టాలు ఇవ్వలేదని పేర్కొంటూ ఈ కూల్చివేతలు మంగళవారం మొదలయ్యాయి. ఈ క్రమంలో వేలాది మంది తమ ఇళ్లను కోల్పోయారు. బాధితుల ఆవేదన వర్ణణాతీతంగా ఉంది. కూల్చివేతలు కొనసాగుతున్న సమయంలో ఓ మహిళ 10 నిమిషాల సమయం ఇవ్వండి చివారిసారి నా ఇల్లు మొత్తం తిరిగి చూసి వస్తా అంటూ పోలీసులను వేడుకున్న దృశ్యాలు అందర్నీ భావోద్వేగానికి గురి చేశాయి.

ఆమె ఆవేదనను అర్ధం చేసుకున్న మహిళా కానిస్టేబుళ్లు సమయం ఇవ్వడంతో సదరు మహిళ దుఖంతో చివరిసారిగా ఎంతో కష్టపడి, రూపాయి రూపాయి పోగేసుకుని నిర్మించుకున్న ఇంటిని చూసుకున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చి కుటుంబ సభ్యులను చూస్తూ బోరున విలపించారు. ఖాళీ చేయాలని ముందస్తు సమాచారం అయినా ఇవ్వాలి కదా అని బాధితులు వాపోతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే 650కి పైగా ఇళ్లను అధికారులు కూల్చివేయడంతో రెండు వేల మందికిపైగా రాత్రికి రాత్రే నిరాశ్రులయ్యారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions