Sunday 26th January 2025
12:07:03 PM
Home > తాజా > 80 సీట్లకు ఒక్క సీటు తక్కువైనా…రేవంత్ రెడ్డి ఛాలెంజ్!

80 సీట్లకు ఒక్క సీటు తక్కువైనా…రేవంత్ రెడ్డి ఛాలెంజ్!

Revanth Reddy

Revanth Reddy Challenge | టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయభేరీ సభలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవిత (Kalvakuntla Kavitha) ను ఎంపీ గా ఓడించినందుకే కేసీఆర్ నిజామాబాద్ జిల్లా పై కక్ష కట్టారని విమర్శించారు.

ఎన్నికలు రాగానే కేసీఆర్ బక్క పలుచని వ్యక్తినని చెప్పుకుంటారని, కానీ ఒక బక్క పలుచ వ్యక్తి కోట్ల రూపాయలు, వేల ఎకరాల భూమిని ఎలా దోచుకున్నారని ధ్వజమెత్తారు రేవంత్ (Revanth Reddy).

కేసీఆర్ (KCR) బక్క పలుచని వాడు, కేటీఆర్ (KTR) తిరుగుబోతు అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇందిరమ్మ రాజ్యం అంటే విమర్శిస్తున్నారని కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే పేదోడి రాజ్యం అని స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్.

బీఆరెస్ అంటే దొరల, దోపిడీ రాజ్యం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ కట్టిన శ్రీరాం సాగర్ (Sriram Sagar)ను చూపించి మేము ఓట్లు అడుగుతాం, మేడిగడ్డ ను చూపించి కేసీఆర్ ఓట్లు అడగగలడా అంటూ ప్రశ్నించారు రేవంత్.

కాంగ్రెస్ (Congress) కచ్చితంగా 80 సీట్లు గెలుస్తుందని, ఒక్క సీటు తక్కవ అయిన కేసీఆర్ విధించే శిక్షకు తనకు సిద్ధం అంటూ సవాల్ విసిరారు రేవంత్.

You may also like
indira bhavan
కాంగ్రెస్ పార్టీ కొత్త ఆఫీస్ ప్రారంభం.. ఈ భవనం పేరేంటో తెలుసా!
cm revanth reddy
‘వీళ్లు అనాథలు కాదు.. రాష్ట్ర సంపద’
అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
cm revanth reddy
“కేసీఆర్ గారూ మీరు రండి.. మమ్మల్నిఇరుకున పెట్టండి”: సీఎం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions