Monday 17th November 2025
12:07:03 PM
Home > తాజా > ఆ అవసరం మాకు లేదు.. కాంగ్రెస్ నేతలకు కిషన్ రెడ్డి కౌంటర్!

ఆ అవసరం మాకు లేదు.. కాంగ్రెస్ నేతలకు కిషన్ రెడ్డి కౌంటర్!

BJP Kishan REddy

Kishan Reddy Chitchat | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని (Congress Government) కూల్చే కుట్రలు జరుగుతున్నాయంటూ ఆ పార్టీ నాయకులు బీజేపీ, బీఆరెస్ పార్టీలపై ఆరోపణలు చేస్తున్నారు.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేందుకు తెర వెనుక బీజేపీ (BJP), గుజరాత్ (Gujarat) వ్యాపారులతో కలసి బీఆరెస్ పార్టీ ప్లాన్ చేసిందరి పలువురు నేతలు ఆరోపించారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో ఆయన చిట్ చాట్ లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్నారు.

అయినా, తెలంగాణకు సంబంధం లేని గుజరాత్ వ్యాపారులు ప్రభుత్వాన్ని ఎందుకు కూల్చుతారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డే (Revanth Reddy) రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు పాలించాలనే తాము  కోరుకుంటున్నామని చెప్పారు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి మిగిలేది శూన్య హస్తమేనని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని.. ఆ పార్టీ ఓడిపోబోతోందనే విషయం సామాన్య ప్రజలకు కూడా తెలుసని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

You may also like
land
రూ. 10 వేలకే 2 ఎకరాలభూమి.. తెలంగాణలోనే!
bus fire in saudi
సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం..
Digital Arrest
డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.32 కోట్లు కోల్పోయిన మహిళ!
భారత్ ఓటమి..15 ఏళ్ల తర్వాత సఫారీల

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions