Ram Gopal Varma | డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సమకాలీన రాజకీయాలపై తెరకెక్కుతున్న చిత్రం వ్యూహం. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన సందర్భంగా వర్మ శుక్రవారం మీడియా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ఆర్జీవీ తనదైన శైలిలో సమాధానాలిచ్చారు.
చంద్రబాబు అంటే ఇష్టమా.. కోపమా.. అని అడగితే.. చంద్రబాబు అంటే తనకు రసగుల్లా కంటే ఎంతో ఇష్టమని వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్నికల కోసమే సినిమా తీశామనీ, అలాంటప్పుడు ఎన్నికల ముందు కాక ఇంకెప్పుడు రిలీజ్ చేస్తామని ఎదురు ప్రశ్నించారు. రాజకీయ నాయకుల బెడ్ రూములు, బాత్రూంలో ఏం జరిగిందో చూపిస్తానన్నారు.
సినిమా రిలీజ్ తర్వాత జగన్ మళ్లీ గెలుస్తాడా అనే ప్రశ్నకు తానేమీ జ్యోతిష్యుడిని కాదన్నారు వర్మ. పవన్ కల్యాణ్ లో నిలకడ లేదనీ, ఆయణ్ని చూస్తుంటే నాకు ఎంటర్ టైన్ మెంట్ అందుకే ఇష్టమని కామెంట్ చేశారు.
తనకు ఎప్పటికీ ప్రజాసేవ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఇక వ్యూహం 2 సినిమాలో వైఎస్సార్ మరణించిన టైం నుండి జగన్ సీఎం అయ్యేదాకా.. ఎవరెవరూ ఏమేం వ్యూహాలు పన్నారనేది చూపిస్తామన్నారు.