Saturday 17th October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > నవరాత్రి ఉత్సవాల్లో సినిమా పాటలపై డ్యాన్సులు చేస్తే కఠిన చర్యలు!

నవరాత్రి ఉత్సవాల్లో సినిమా పాటలపై డ్యాన్సులు చేస్తే కఠిన చర్యలు!

  • మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు!

Madras High Court Movie Songs Dance Navaratri Orders నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సినిమా పాటలకు నృత్యాలు (డ్యాన్సులు) చేయడంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉత్సవాల నిర్వహణకు పోలీసులు విధించిన నిబంధనలు లేదా షరతులను ఎవరైనా ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని తమిళనాడు పోలీసులను హైకోర్టు ఆదేశించింది.‌

అసలేం జరిగిందంటే..

నవరాత్రి ఉత్సవాల పేరుతో సినిమా పాటలకు నృత్యాలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ‘భారత్ హిందూ మున్నాని’ రాష్ట్ర కార్యదర్శి దిల్లీ బాబు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే నవరాత్రి పవిత్రతకు ఈ కార్యక్రమాలు భంగం కలిగిస్తున్నాయని ఆరోపించారు.

ప్రైవేట్ హోటళ్లు, మాల్స్‌లో వేడుకలు:

కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా చెన్నైలోని ప్రైవేట్ హోటళ్లు, మాల్స్‌లో ఉత్సవాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. గతేడాది చెన్నైలోని రాయపేట ఎక్స్‌ప్రెస్ అవెన్యూ మాల్‌లో గుజరాత్‌కు చెందిన ఓ సంస్థ దుర్గాదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి సినిమా పాటలతో నృత్య కార్యక్రమాలు నిర్వహించిందని, ఈ ఏడాది కూడా అదే తరహా అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు.

పవిత్రతకు భంగం:

నవరాత్రి వేడుకల్లో ఇంగ్లిష్ హిప్‌హాప్, బాలీవుడ్ పాటలు ప్లే చేయడం, అక్కడికి వచ్చే యువత మద్యం సేవించడం వల్ల ఇతరులకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. ఈ విషయమై అక్టోబర్ 12న ప్రభుత్వానికి, పోలీసులకు వినతిపత్రం సమర్పించినా స్పందన రాలేదని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించారు.

కోర్టులో వాదనలు & తీర్పు:

  • న్యాయవాది వాదనలు: పిటిషనర్ తరఫున న్యాయవాది రిచర్డ్‌సన్ విల్సన్ వాదనలు వినిపిస్తూ.. గర్బా, దాండియా నృత్యాలు సంప్రదాయంలో భాగమేనని, అయితే ఎలాంటి పాటలు ప్లే చేస్తున్నారు, అక్కడ మద్యం అందిస్తున్నారా అనే అంశాలను పరిశీలించాలని కోరారు.
  • హైకోర్టు స్పందన: ఈ వాదనలను విన్న జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్, నవరాత్రి వేడుకల్లో సినిమా పాటలకు నృత్యాలు చేయడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. ఉత్సవాల నిర్వహణకు పోలీసులు విధించిన షరతులకు విరుద్ధంగా వ్యవహరిస్తే తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఈ కేసుకు సంబంధించిన విచారణను ముగించారు.
You may also like
justice suryakant
నల్సార్ విద్యార్థుల నమోదుపై ఆంక్షలు తప్పు: సీజేఐ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions