Monday 9th December 2024
12:07:03 PM
Home > సినిమా > నాని విలన్ తో తమన్నా డేటింగ్.. హగ్స్, కిసెస్ తో హంగామా!

నాని విలన్ తో తమన్నా డేటింగ్.. హగ్స్, కిసెస్ తో హంగామా!

Tamannah and Vijay Varma | దాదాపు 15 ఏళ్ల కిందట శ్రీ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది తమన్నా బ్యూటీ.

మిల్కీ బ్యూటీగా గుర్తింపు పొందిన తమన్నా టాలీవుడ్, కోలీవుడ్ దాదాపు టాప్ హీరోలందరి సరసన ఆడిపాడింది.

నటనతోపాటు గ్లామర్ ఒకలబోయడంలో తిరుగులేకుండా సౌత్ ఇండస్ట్రీని కొన్నాళ్లపాటు తన అందంతో మెస్మరైజ్ చేసింది.

ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. ‘కిట్టి’ అనే మలయాళ చిత్రంలో కూడా నటిస్తోంది.

ఇక దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన తర్వాత బాలీవుడ్ పై ఫోకస్ చేసిన మిల్కీ బ్యూటీ అక్కడా స్టార్ హీరోలతో నటించింది. తాజాగా బాలీవుడ్ పైనే ఎక్కువ దష్టి సారించింది.

ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ లో నటిస్తోంది. గతంలో వచ్చిన నెట్ ఫ్లిక్స్ సిరీస్ లస్ట్ స్టోరీస్ కి ఇది కొనసాగింపు.

‘డార్లింగ్స్, గల్లీ బాయ్స్’ చిత్రాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ వర్మ (Vijay varma)తో కలసి లస్ట్ స్టోరీస్ సిరీస్ లో రొమాన్స్ చేయనుంది తమన్నా.

ఈ కపుల్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఇలా ఉండగా ఆఫ్ స్క్రీన్ లో వీరు రిలేషన్ షిప్ లో ఉన్నట్టు రూమర్లు వస్తున్నాయి.

ఈ రూమర్లకు ఊతమిస్తూ తమన్నా విజయ్ ఇద్దరూ గోవాలో న్యూ ఈయర్ వేడుకల్లో చాలా క్లోజ్‌గా మూవ్ అయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెబుతూ తమన్నా విజయ్ ఇద్దరూ హగ్స్, కిస్సింగ్స్‌తో ఎంజాయ్ చేస్తున్న వీడియోను పలువురు నెటిజన్లు పోస్ట్ చేశారు.

ఇప్పటికే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని గత కొన్ని రోజుల నుంచే రూమర్స్ వినిపిస్తుండగా.. ఈ తాజా వీడియోతో వీరి డేటింగ్ వ్యవహారాన్ని కన్‌ఫర్మ్ చేసేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ పుకార్లపై తమన్నా గానీ, విజయ్ గానీ ఇంకా స్పందించలేదు.

ఇంతకీ ఈ విజయ్ వర్మ ఎవరో తెలుసా.. నాని సినిమా ఎంసీయేలో విలన్ గా నటించాడు.


Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions