Saturday 27th July 2024
12:07:03 PM
Home > సినిమా > హెలికాప్టర్ లో సాంకేతిక లోపం.. బాలయ్యకు తప్పిన పెను ప్రమాదం!

హెలికాప్టర్ లో సాంకేతిక లోపం.. బాలయ్యకు తప్పిన పెను ప్రమాదం!

Nandamuri Balakrishna |

నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం వీర సింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాలయ్యను ఢీకొట్టే పాత్రలో ప్రముఖ నటుడు దునియా విజయ్ నటించారు.

శ్రుతిహాసన్, హనీ రోజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శుక్రవారం ఒంగోలులోని అర్జున్ ఇన్ ఫ్రా మైదానంలో వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. అక్కడే సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

ఈ వేడుక అనంతరం శనివారం ఉదయం ఒంగోలు నుంచి తిరిగి హైదరాబాద్ బయల్దేరారు బాలయ్య. అయితే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‏లో సాంకేతిక  లోపం తలెత్తింది.

Read Also: నాని విలన్ తో తమన్నా డేటింగ్.. హగ్స్, కిసెస్ తో హంగామా!

హెలికాప్టర్ టేకాఫ్ అయిన అయిన కాసేపటికే సాంకేతిక లోపాన్ని గుర్తించారు ఫైలట్‌. దీంతో తిరిగి వెంటనే మళ్లీ ఒంగోలులో సేఫ్‌ ల్యాండ్ చేశారు.

సాంకేతిక లోపం సవరించే ప్రయత్నం చేస్తున్నారు టెక్నీషియన్స్‌. ఒకవేళ రిపేర్‌కాకపోతే రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు రానున్నారు బాలయ్య. హెలికాప్టర్ లో లోపాన్ని ఆదిలోనే గుర్తించడంతో బాలయ్యకు పెను ప్రమాదం తప్పినట్లైంది.  

You may also like
పొరపాటు జరిగింది.. మన్నిస్తారని ఆశిస్తున్నా: బాలయ్య బాబు లేఖ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions