Sunday 30th August 2026
12:07:03 PM
Home > తాజా > ‘కడిగిన ముత్యంలా బయటకు వచ్చా’

‘కడిగిన ముత్యంలా బయటకు వచ్చా’

Kalvakuntla Kavitha News | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు బిగ్ రిలీఫ్ లభించిన విషయం తెల్సిందే. ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులగా ఉన్నవారి పేర్లను రౌస్ ఎవెన్యూ కోర్టు డిశ్చార్జ్ చేసిన విషయం తెల్సిందే. ఈ తరుణంలో కవిత స్పందించారు. న్యాయవ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందని కవిత అన్నారు. తాను కడిగిన ముత్యంలా బయటికి వస్తానని తెలంగాణ ప్రజలకు మొదట్నుంచి చెబుతున్నట్లు ఇప్పుడు అలానే వచ్చినట్లు సంతోషం వ్యక్తం చేశారు.

ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని ఎన్నోసార్లు చెప్పినట్లు తెలిపారు. తాను, తన కుటుంబం కొన్ని నెలలపాటు క్షోభ అనుభవించిందని ఆమె ఆవేదన చెందారు. విపక్షాలను వేధించేందుకు దర్యాప్తు సంస్థలను -వాడుకుంటున్నారని ఆరోపించారు. కోర్టు తీర్పు రాకుండానే తనపై కొందరు అనుచితంగా మాట్లాడారని ఈ సందర్భంగా కష్ట సమయంలో అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions