Tuesday 14th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఢిల్లీ లిక్కర్ కేసు..కేజ్రివాల్-కవితకు బిగ్ రిలీఫ్

ఢిల్లీ లిక్కర్ కేసు..కేజ్రివాల్-కవితకు బిగ్ రిలీఫ్

Delhi Court closes CBI case against all 23 accused | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సహా 23 మందికి బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారి పేర్లను కోర్టు డిశ్చార్జ్ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసుపై తాజగా రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. సరైన ఆధారాలు లేకుండానే కేసులో వీరి పేర్లను చేర్చారని సీబీఐపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలో నిందితులుగా పేర్కొన్న వారి పేర్లను కోర్టు డిశ్చార్జ్ చేసింది. అయితే రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పును సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంటూ సీబీఐ 2022లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టిన విషయం తెల్సిందే. అనంతరం ఈ కేసులో భాగంగా కేజ్రివాల్, సిసోడియా మరియు కవితను సీబీఐ అప్పట్లో అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions