Sunday 6th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘పవన్ కు చేరువగా వచ్చిన వైసీపీ కార్యకర్త’

‘పవన్ కు చేరువగా వచ్చిన వైసీపీ కార్యకర్త’

Deputy Cm Pawan Kalyan News | ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి కదలికలు గమనించినట్లు పేర్కొంది డిప్యూటీ సీఎం కార్యాలయం. ఈ విషయాన్ని డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 26వ తేదీన రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన విషయం తెల్సిందే. ఈ సందర్భంలో అపరిచిత వ్యక్తి- పవన్ కళ్యాణ్ కు చేరువగా సంచరించారని ఆ రోజు శంకరగుప్తం డ్రయిన్ మూలంగా దెబ్బ తిన్న కొబ్బరి తోటలు పరిశీలిస్తున్న సమయంలోనూ, అధికారులతో సంభాషిస్తున్న సందర్భంలో, ఆ తరవాతి కార్యక్రమాల్లో సదరు వ్యక్తి పవన్ సమీపంలో సంచరించారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

అతను రాజోలు నియోజక వర్గంలోని వైసీపీకి చెందిన కార్యకర్తగా సమాచారం చేరిందని వివరించింది. అతని వ్యవహార శైలి, కదలికలపై అనుమానం వ్యక్తమయిన నేపథ్యంలో డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తీసుకువెళ్లారు. అతని కదలికలు, కార్యక్రమానికి జారీ చేసిన పాస్ అతను చేరడంపై ఉన్న సందేహాలను జిల్లా ఎస్పీకి అధికారులు వివరించినట్లు పవన్ పేషీ పేర్కొంది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions