Thursday 17th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘ఇది మహా కుంభమేళా కాదు..మృత్యు కుంభమేళా’

‘ఇది మహా కుంభమేళా కాదు..మృత్యు కుంభమేళా’

Cm Mamata Banerjee About Maha Kumbh | ఉత్తర్ ప్రదేశ్ ( Uttar Pradesh ) లోని ప్రయాగ్రాజ్ ( Prayagraj ) లో మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెల్సిందే.

అయితే కుంభమేళా పై సంచలన వ్యాఖ్యలు చేశారు వెస్ట్ బెంగాల్ ( West Bengal ) సీఎం మమతా బెనర్జీ. ఇది మహా కుంభమేళా కాదు, మృత్యు కుంభమేళా అని అభివర్ణించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం కూడా వివరించారు.

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడం మూలంగా సామాన్య ప్రజలు తొక్కిసలాట మరణించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వీఐపీల ఏర్పాట్ల కోసం పెట్టిన శ్రద్ధను సామాన్యల ఏర్పాట్ల కోసం పెట్టలేదని మండిపడ్డారు.

తనకు మహా కుంభమేళా పై గౌరవం ఉందని, గంగాదేవిని తాను కూడా పూజిస్తానని చెప్పిన దీదీ యూపీ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టారు.

కుంభమేళాలో రూ.లక్ష పెట్టి గదులను అద్దెకు తీసుకునే సౌకర్యం డబ్బున్నవారికోసం చేశారు, మరి పేదల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేసారని సీఎం నిలదీశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions