Wednesday 29th July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > H-1B వీసాదారులకు గుడ్‌న్యూస్?.. 7 ఏళ్లతో గ్రీన్ కార్డ్‌కు కొత్త బిల్లు!

H-1B వీసాదారులకు గుడ్‌న్యూస్?.. 7 ఏళ్లతో గ్రీన్ కార్డ్‌కు కొత్త బిల్లు!

US Green Card Bill | అమెరికాలో దీర్ఘకాలంగా నివసిస్తున్న భారతీయ H-1B వీసాదారులకు గ్రీన్ కార్డ్ ప్రక్రియలో కీలక మార్పుకు మార్గం సుగమమయ్యే అవకాశం కనిపిస్తోంది. అమెరికా సెనేటర్ అలెక్స్ పడిల్లా గ్రీన్ కార్డ్ అర్హతకు సంబంధించిన రిజిస్ట్రీ నిబంధనలో మార్పులు ప్రతిపాదిస్తూ బిల్లును మరోసారి కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం, 1972 జనవరి 1కు ముందు అమెరికాలో నివసిస్తున్న కొద్ది మంది వలసదారులకు మాత్రమే రిజిస్ట్రీ ద్వారా గ్రీన్ కార్డ్‌కు దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఐదు దశాబ్దాలుగా ఈ కటాఫ్ తేదీ మారకపోవడంతో ఈ నిబంధన దాదాపు ఉపయోగం లేకుండా పోయిందని విమర్శలు ఉన్నాయి.

7 ఏళ్ల నివాసమే అర్హతకు ఆధారం

అలెక్స్ పడిల్లా ప్రతిపాదించిన బిల్లు ప్రకారం, నిర్దిష్ట తేదీ విధానాన్ని తొలగించి, అమెరికాలో కనీసం ఏడు సంవత్సరాలు నిరంతరాయంగా నివసించిన వలసదారులకు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసే అవకాశం కల్పించాలని ప్రతిపాదించారు. అయితే దరఖాస్తుదారులకు నేర చరిత్ర లేకపోవడం, ఇతర చట్టపరమైన అర్హతలు ఉండటం తప్పనిసరి.

భారతీయ H-1B వీసాదారులకు భారీ ఊరట

అమెరికాలో H-1B వీసాదారుల్లో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్ కోసం చాలా మంది భారతీయ నిపుణులు 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ బిల్లు చట్టంగా మారితే, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అనేక మంది భారతీయ H-1B వీసాదారులకు శాశ్వత నివాసం పొందేందుకు ప్రత్యామ్నాయ మార్గం లభించే అవకాశం ఉంది.

80 లక్షల మందికి ప్రయోజనం?

ఈ ప్రతిపాదిత మార్పు వల్ల దేశవ్యాప్తంగా 80 లక్షల మందికి పైగా వలసదారులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని అంచనా. వీరిలో డ్రీమర్స్ (Dreamers), టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ (TPS) పొందిన వారు, దీర్ఘకాల వీసాదారుల పిల్లలు, నిత్యావసర సేవల కార్మికులు, అలాగే H-1B వీసాదారులు ఉన్నారు. ఈ బిల్లుకు ఇప్పటికే 30కిపైగా సంస్థలు మద్దతు ప్రకటించాయి.

ఇప్పటికైతే ప్రతిపాదన మాత్రమే

అయితే ఈ మార్పులు వెంటనే అమల్లోకి రావు. బిల్లు అమెరికా కాంగ్రెస్ ఆమోదం పొందిన తర్వాతే చట్టంగా మారుతుంది. అప్పటి వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న 1972 కటాఫ్ నిబంధనే కొనసాగుతుంది. కాబట్టి ప్రస్తుతం H-1B వీసాదారులు కేవలం ఏడు సంవత్సరాలు అమెరికాలో నివసించినంత మాత్రాన గ్రీన్ కార్డ్‌కు అర్హులు కారు.

You may also like
బంగ్లా హాదీ హత్య..నిందితులు భారత్ లోనే?
bus fire in saudi
సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం..
h1b visa process
H1B Visa ఫీజు పెంపు.. క్లారిటీ ఇచ్చిన వైట్ హౌజ్!
నేపాల్ లో ‘Gen-Z ఉద్యమం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions