Thursday 10th September 2026
12:07:03 PM
Home > తాజా > నగరంలో రోడ్ల వ్యవస్థ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

నగరంలో రోడ్ల వ్యవస్థ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

CM Revanth On Hyd Roads | హైదరాబాద్ నగరంలోని రోడ్ల వ్యవస్థలన్నింటినీ ఒకే పరిపాలనా విధానం (Unified Administrative System) పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) మరియు హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HRDCL) ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయం వెల్లడించారు.

ఏకీకృత వ్యవస్థ పరిధిలోకి కీలక అంశాలు..

నగర భవిష్యత్తు మరియు రవాణా సౌకర్యాలు ప్రధానంగా రోడ్ల అభివృద్ధిపైనే ఆధారపడి ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

భూసేకరణ, నిధుల సమీకరణ/రుణాలు, మరియు రోడ్ల నిరంతర నిర్వహణ వంటి అన్ని అంశాలను ఈ ఒకే పరిపాలనా వ్యవస్థ పర్యవేక్షిస్తుంది.

ఔటర్ రింగ్ రోడ్ (ORR), ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ (RRR)లతో పాటు నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, మరియు ఇతర ప్రధాన రహదారులను కూడా దీని పరిధిలోకి తీసుకురానున్నారు.

రోడ్ల ప్రణాళిక మరియు నిర్మాణ ప్రక్రియలో ట్రాఫిక్ పోలీసు అధికారులను కూడా భాగస్వాములను చేయాలని సీఎం సూచించారు.

ఓఆర్‌ఆర్ (ORR) కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ఆగ్రహం..

ఔటర్ రింగ్ రోడ్ నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓఆర్‌ఆర్‌పై బాధ్యత వహిస్తున్న కాంట్రాక్టర్ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వాహనాలను అస్తవ్యస్తంగా నిలపడం వల్లే ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఓఆర్‌ఆర్ నిర్వహణ మరియు భద్రతపై ఇకపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు.

You may also like
cm revanth speech
ఇది 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానం’: అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆగ్రహం!
గణేశ్ చతుర్థి వేళ చిరంజీవి కీలక పిలుపు!
BJP Kishan REddy
జీవో 97ను బేషరతుగా రద్దు చేయాలి: కిషన్ రెడ్డి!
మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions