Saturday 23rd May 2026
12:07:03 PM
Home > తాజా > ప్రభాస్ ‘ఫౌజీ’ ఫోటోల లీక్.. చిత్ర యూనిట్ వార్నింగ్!

ప్రభాస్ ‘ఫౌజీ’ ఫోటోల లీక్.. చిత్ర యూనిట్ వార్నింగ్!

Fauji photos leaked

Prabhas Fauji Movie Photos Leaked | రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, సెన్సిబుల్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’ (Fauji).

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా కొన్ని వర్కింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవ్వడం చిత్ర యూనిట్‌ను తీవ్ర అసహనానికి గురిచేసింది.

ప్రభాస్ లుక్‌కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో, మూవీ టీమ్ వెంటనే స్పందిస్తూ లీకు రాయుళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది.

తమ కష్టాన్ని వృధా చేయొద్దని, లీకైన కంటెంట్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.

“వెండితెరపై ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించేందుకు మేము అహర్నిశలు శ్రమిస్తున్నాం. ఇలాంటి లీకుల వల్ల సినిమాపై ఉన్న ఉత్సుకత దెబ్బతింటుంది. దయచేసి లీకైన ఫోటోలను ప్రోత్సహించకండి” అని చిత్ర యూనిట్ కోరింది.

ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

దర్శకుడు హను రాఘవపూడి కూడా ఈ విషయంపై స్పందిస్తూ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. “మీ కోసం ఒక మేజికల్ కంటెంట్‌ను రూపొందిస్తున్నాం.

సినిమా విడుదలయ్యాక థియేటర్లలో ఆ మ్యాజిక్‌ను ఎంజాయ్ చేయాలి కానీ, ఇలాంటి లీకుల ద్వారా ఆ అనుభూతిని ముందే స్పాయిల్ చేయవద్దు” అని ఆయన కోరారు.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ లీకుల పర్వం చిత్ర బృందాన్ని కలవరపెడుతుండటంతో, సెట్స్‌లో భద్రతను మరింత కఠినతరం చేసినట్లు తెలుస్తోంది.

You may also like
sai pallavi
నేను అనని మాటలను నాపై మోపారు: సాయి పల్లవి ఆవేదన!  
Renu Desai
రేణు దేశాయ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. ఆరుగురు అరెస్ట్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions