Sunday 23rd August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > నూతన దంపతుల గొప్ప మనసు.. అనాథలే ముఖ్య అతిథులు!

నూతన దంపతుల గొప్ప మనసు.. అనాథలే ముఖ్య అతిథులు!

new couple invites orphans as cheif guests

– బహుమతులు వద్దన్నారు..

– అనాథల ముఖాల్లో చిరునవ్వు నింపారు!

Turkish couple invites orphans to wedding | సాధారణంగా పెళ్లి అంటే అట్టహాసాలు, ఖరీదైన బహుమతులు, విందు వినోదాలే గుర్తొస్తాయి. కానీ టర్కీలోని షాన్లీఉర్ఫా నగరానికి చెందిన ఒక నూతన జంట తమ వివాహాన్ని లోకానికి ఆదర్శంగా మార్చుకున్నారు.

వధూవరులు ఫాతిమా మరియు ముహమ్మద్ తమ పెళ్లి వేడుకలో ప్రదర్శించిన గొప్ప మనసు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.

తమ సంతోషాన్ని కేవలం బంధుమిత్రులకే పరిమితం చేయకుండా, సమాజంలో ఆదరణకు నోచుకోని అనాథ పిల్లలతో పంచుకోవాలని వారు తీసుకున్న నిర్ణయం అందరినీ కదిలిస్తోంది.

ఈ జంట తమ వివాహ ఆహ్వాన పత్రికలోనే అతిథులకు ఒక వినూత్నమైన విన్నపం చేశారు. “మాకు ఎటువంటి ఖరీదైన బహుమతులు, బంగారం లేదా డబ్బు వద్దు.. వీలైతే ఒక్కో అతిథి తమతో పాటు ఒక అనాథ బాలుడిని లేదా బాలికను వెంట తీసుకురండి” అని కోరారు.

వారి పిలుపు మేరకు పెళ్లి రోజున సుమారు 100 మంది అనాథ చిన్నారులు ఆ వేడుకకు తరలివచ్చారు. వారందరినీ ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించిన నూతన దంపతులు, స్వయంగా దగ్గరుండి రుచికరమైన భోజనం వడ్డించారు.

అనంతరం ఆ పిల్లలందరికీ బహుమతులు అందజేసి వారి ముఖాల్లో వెలకట్టలేని చిరునవ్వును పూయించారు.

పెళ్లి వేడుకలో ఆ చిన్నారులు డాన్సులు చేస్తూ, నూతన వధూవరులతో కలిసి కేరింతలు కొడుతూ గడపడం అక్కడి వారిని భావోద్వేగానికి గురిచేసింది.

ఈ సందర్భంగా వధువు ఫాతిమా మాట్లాడుతూ.. “మా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజున, ఈ పిల్లలతో కలిసి సంతోషాన్ని పంచుకోవడం మాకు దక్కిన అతిపెద్ద బహుమతి” అని పేర్కొన్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. “నిజమైన సంపద అంటే పంచుకోవడంలోనే ఉంది” అని నిరూపించిన ఈ జంటపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

You may also like
అర నిమిషంలో 195ముద్దులు.. గిన్నిస్ బుక్‌లోకెక్కిన లవర్స్!
ఇండోనేషియాలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం!
స్లోవేకియాలో మోదీ.. ‘బ్రెడ్ & సాల్ట్’ సంప్రదాయంతో ఘన స్వాగతం!
ఇరాన్‌పై ట్రంప్ ‘బూతు’ పురాణం.. 48 గంటల డెడ్‌లైన్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions