Saturday 8th August 2026
12:07:03 PM
Home > క్రీడలు > శ్రేయస్ రికార్డును బ్రేక్ చేసిన పంత్..ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధికం

శ్రేయస్ రికార్డును బ్రేక్ చేసిన పంత్..ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధికం

Rishab Pant IPL Mega Auction | ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా జరుగుతోంది. ఆదివారం జరిగిన ఆక్షన్ లో అందరి అంచనాలు నిజం అయ్యాయి. ఐపీఎల్ మెగా ఆక్షన్ లో అందరి చూపు రిషబ్ పంత్ వైపే.

ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధరకు పంత్ పలికాడు. ఇదే ఆక్షన్ లో అత్యధిక ధర రూ.26.75 కోట్లకు పలికి రికార్డ్ సృష్టించిన శ్రేయస్ రికార్డును నిమిషాల వ్యవధిలోనే పంత్ బద్దలుకొట్టాడు.

ఏకంగా రూ.27 కోట్లకు పంత్ ను లక్నో సొంతం చేసుకుంది. ఆర్టిఎం పద్దతిలో ఢిల్లీ తిరిగి దక్కించుకోవాలని చూసినా లక్నో మాత్రం ఎక్కడా తగ్గలేదు.

కీపర్, బ్యాటింగ్, కెప్టెన్ మూడు విభాగాల్లోనూ పంత్ కు అనుభవం ఉంది. ఈ క్రమంలోనే అత్యధిక ధరకు పంత్ ను లక్నో దక్కించుకుంది.

మరోవైపు రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ తో ఆక్షన్ లోకి వచ్చిన శ్రేయస్ ను రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions