Telangana BJP President News | తెలంగాణలో 27 జిల్లాలకు నూతన అధ్యక్షుల్ని బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం జాబితాను విడుదల చేసింది.
ఈ సమయంలో రాష్ట్ర అధ్యక్ష పదవి పైకొత్త పేర్లు తెరపైకి వచ్చినట్లు కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే ఎంపీలు ఈటల రాజేందర్ ( Eatala Rajender ), ధర్మపురి అర్వింద్ ( Dharmapuri Arvind ) మరియు రామచందర్ రావు పేర్లు వినిపిస్తున్నాయి. కానీ పాత కొత్త అని విభేదాలు తలెత్తడంతో అధిష్టానం మధ్యేమార్గంగా వేరే పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మురళీధర్ రావు, డీకే అరుణ పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఒక్కరికి అధ్యక్ష పదవి దక్కితే బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశం ఉంది. శాసనసభ పక్ష నేతగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర రెడ్డి ఉన్నారు.
అధ్యక్ష పదవి కూడా రెడ్డి లేదా వెలమ వర్గానికి ఇస్తే బీసీల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ ( Working President )వారికి ఇవ్వాలని అధిష్టానం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఒకవేళ అధ్యక్ష పదవి ఈటల లేదా ధర్మపురి అర్వింద్ లో ఒకరికి దక్కితే వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తావన ఉండదని బీజేపీ నేతలు చెబుతున్నారు.