Alastair Cook Huge Praise For Abhishek Sharma | టీం ఇండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆదివారం ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు.
ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన చివరి టీ20 లో అభిషేక్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ, 37 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. మొత్తంగా 54 బంతుల్లో ఏడు ఫోర్లు, 13 సిక్సులతో 135 పరుగులు చేసి టీ20ల్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ( One Of The Best Innings ) ఆడాడు.
ఈ క్రమంలో అభిషేక్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇందులో భాగంగ ఇంగ్లాండ్ దిగ్గజ ప్లేయర్ అలిస్టర్ కుక్ ( Alaistair Cook ) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ శర్మ కేవలం రెండు గంటల్లోనే తన కెరీర్ ను దాటేశాడని కితాబిచ్చారు.
తన క్రికెట్ కెరీర్ లో బాదిన సిక్సర్లను అభిషేక్ కేవలం రెండు గంటల్లోనే క్రాస్ చెప్పినట్లు కుక్ చెప్పారు. కాగా అలిస్టర్ కుక్ ఇంగ్లాడ్ తరఫున 161 టెస్టు మ్యాచులు ఆడగా 291 ఇన్నింగ్స్ లో మొత్తం 11 సిక్సులు మాత్రమే కొట్టగలిగాడు. అలాగే 92 వన్డేల్లో 10 సిక్సులను తన ఖాతాలో వేసుకున్నాడు.