Producer KP Chowdhary Dies By Suicide in Goa | ప్రముఖ నిర్మాత కేపీ చౌదరి ( KP Chowdhary ) గోవాలో సోమవారం సూసైడ్ చేసుకున్నారు. నిర్మాత మృతిపై పోలీసులు పాల్వంచలోని ఆయన తల్లికి సమాచారం అందించారు.
రజినీకాంత్ కథానాయకుడిగా వచ్చిన కబాలి మూవీ ప్రొడ్యూసర్స్ లో కేపీ చౌదరి ఒకరు. పలు తెలుగు, తమిళ సినిమాలకు ఆయన డిస్ట్రిబ్యూటర్ గాను వ్యవహరించారు.
సర్దార్ గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, అర్జున్ సురవరం వంటి మూవీలకు చౌదరి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు.
గతంలో డ్రగ్స్ విక్రయిస్తుండగా కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు.