Arla Village Gets Power | మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ కరెంటు లేని గ్రామాలు ఉన్నాయంటే నమ్మశక్యంగా లేదు కదా. కానీ ఇది నిజం.
ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ పలు మారుమూల గిరిజన గ్రామాల్లో కరెంట్, రోడ్డు, ఆసుపత్రి సౌకర్యాలకు దూరంగా ఉన్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లోని ఓ గిరిజన గ్రామంలో స్వాతంత్ర్యం వచ్చిన 77 ఏళ్ల తర్వాత కరెంట్ వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని అనకాపల్లి జిల్లా రోలుగుంట (మ) అర్ల పంచాయతీలోని నీలబంద గ్రామానికి కరెంటు సదుపాయం వచ్చింది.
మూడు కుటుంబాలకు చెందిన 26 మంది ఆ గ్రామంలో నివసిస్తున్నారు. గ్రామంలో తొలి లైట్ వెలగడంతో గ్రామప్రజలు ఆనందంతో థింసా నృత్యం చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.