Prabhas Look In Kannappa | టాలీవుడ్ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్పప్ప(Kannappa). భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.
భారీ బడ్జెట్ తో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు (Mohan Babu) సొంత బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు కూతుర్లు, కొడుకు సైతం కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar), కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) శివపార్వతుల పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం తాజాగా పోస్టర్ ను విడదల చేసింది.
రుద్ర (Prabhas As Rudra) పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారని చెప్పింది. “ప్రళయ కాల రుద్రుడు! త్రికాల మార్గదర్శకుడు!! శివాజ్ఞ పరిపాలకుడు!!!” అంటూ ప్రభాస్ మెడలో రుద్రాక్షలు, కాషాయ దుస్తులు, పెద్ద జుట్టుతో ఉన్న ప్రభాస్ లుక్ ను విడుదల చేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ పోస్టర్ ను వైరల్ చేస్తున్నారు.