Saturday 2nd May 2026
12:07:03 PM
Home > తాజా > బిగ్ బ్రేకింగ్.. బీజేపీ కీలక నేత ఇంటికి సీఎం రేవంత్!

బిగ్ బ్రేకింగ్.. బీజేపీ కీలక నేత ఇంటికి సీఎం రేవంత్!

revanth meets jithendar reddy

CM Revanth Meets AP Jitendar Reddy | సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గురువారం బీజేపీ కీలక నేత ఏపీ జితేందర్ రెడ్డి (AP Jinthendar Reddy) నివాసానికి వెళ్లారు. ఆయన వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిలు కూడా ఉన్నారు.

కాగా మహబూబ్ నగర్ పార్లమెంట్ నుండి బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ జితేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను సీఎం రేవంత్ కలవడం ఆసక్తిగా మారింది. దీంతో జితేందర్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ లో చేరిక దాదాపు ఖాయంగా కనిపిస్తుంది.

అయితే ఇప్పటికే మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీ చంద్ రెడ్డిని ప్రకటించింది ఆ పార్టీ. ఈ క్రమంలో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ తరఫున వేరే పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగా బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ సీటును మాజీ మంత్రి డీకే అరుణ(DK Aruna)కు కేటాయించిన విషయం తెల్సిందే.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions