Man Kills Lover | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలిని 20 ముక్కలుగా నరికి పొలంలో పూడ్చి పెట్టాడు ప్రియుడు. వివరాలు.. జిల్లాలోని జూలూరుపాడు మండలం మాచినేనిపేటలో స్వాతిని అనే యువతిని ఆమె ప్రియుడు వీరభద్రం 3 రోజుల క్రితం హత్య చేసి, గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టాడు.
సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి స్వాతి వీరభద్రం ఓ జంట దగ్గర నుంచి రూ. 16 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం రాకపోవడంతో మోసపోయి ఆత్మహత్య చేసుకున్నారు బాధిత జంట. అయితే… ఈ తరుణంలోనే ఈ రూ. 16 లక్షలు బాధితుల కుటుంబానికి తిరిగి ఇచ్చేద్దామని స్వాతి ప్రియుడు వీరభద్రంకు చెప్పింది. దీనికి అతడు ఒప్పుకోలేదు.

దీంతో ఈ విషయంలో స్వాతి వీరభద్రంకు మధ్య విబేధాలు తలెత్తాయి. స్వాతిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించిన వీరభద్రం ఆమెను మొదట కిడ్నాప్ చేశాడు. అనంతరం దారుణంగా హత్య చేశాడు. ఆమె బాడీని 20 ముక్కలుగా నరికి గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టాడు. స్వాతి అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.