Cm Revanth May Ban Kangana Movie ‘Emergency’ | సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ) మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా బాలీవుడ్ ( Bollywood ) నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ( Kangana Ranut ) ప్రధాన పాత్రలో, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ ‘ ఎమర్జెన్సీ ‘ ( Emergency )సెప్టెంబర్ 6న విడుదలకు సిద్దంగా ఉంది.
దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ( INDIRA GANDHI ) హయాంలో 1975 నుండి 1977 వరకు సాగిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ మూవీ ( Movie )ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకు తెలంగాణలో భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది.
ఎమర్జెన్సీ సినిమాలో తమ వర్గాన్ని దేశ వ్యతిరేకులుగా, దేశ ద్రోహులుగా చిత్రీకరించారని సిక్కుల బృందం ( Sikh Community ) ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో 18 సభ్యుల సిక్కు బృందం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ( Shabbir Ali )ని కలిసి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదే విషయాన్ని షబ్బీర్ అలీ సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా స్పందించిన సీఎం, న్యాయ నిపుణులు సూచన తీసుకొని రాష్ట్రంలో చిత్రాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.