Vinesh Phogat, Bajrang Punia Join Congress | రెజ్లర్లు వినేశ్ ఫోగాట్ ( Vinesh Phogat ), బజరంగ్ పునియా ( Bajrang Punia ) కాంగ్రెస్ లో చేరారు. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi )ని కలిశారు.
మరికొన్ని వారాల తర్వాత హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ లో వీరి చేరిక ఆసక్తిగా మారింది.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( Wrestling Federation Of India ) మాజీ ప్రెసిడెంట్, బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ సింగ్ ( Brij Bushan Singh ) కు వ్యతిరేకంగా గతేడాది జరిగిన నిరసనల్లో వినేశ్, బజరంగ్ పునియా కీలకంగా వ్యవహరించారు.
ఇదిలా ఉండగా హర్యానా లోని జులానా ( Julana ) స్థానం నుండి వినేశ్ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గం మల్లయోధులకు పెట్టింది పేరు.
బజరంగ్ పునియా బాద్లీ ( Badli ) అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది ఢిల్లీ – గురుగ్రామ్ వంటి అభివృద్ధి చెందిన నగరాలకు దగ్గరగా ఉంటుంది.