Kolkata Doctor Case Accused | వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్ కత్తా (Kolkata)లో ఆగస్ట్ 9న ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ (Sanjay Roy)ని ఘటన జరిగిన మరునాడే పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో సంజయ్ రాయ్ ని ఉరి తీయాలని యావత్ దేశం డిమాండ్ చేస్తుంది. మరోవైపు నిందితుడు మాత్రం జైల్లో తనకు ప్రత్యేక ఆహారం కావాలని గొడవకు దిగుతున్నట్లు తెలుస్తోంది. సంజయ్ రాయ్ ప్రస్తుతం కోల్కత్త లోని ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్ లో ఉన్నాడు.
అయితే ఖైదీల అందరి లాగా సంజయ్ రాయ్ కి కూడా వెజిటేబుల్ కరి, చపాతీ ని పెడుతున్నారు. కానీ, తనకు గుడ్డు కూర కావాలని నిందితుడు పోలీసులను డిమాండ్ చేస్తున్నాడంట. దీంతో పోలీసులు ఆగ్రహించినట్లు కథనాలు వస్తున్నాయి.