Jr NTR Visits Udipi | టాలీవుడ్ హీరో యుంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger Jr NTR) కు ఆయన తల్లి శాలినిపై ఎంతటి ప్రేమ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ఆమె ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న చిరకాల కలను ఎన్టీఆర్ ఎట్టకేలకు నెరవేర్చారు.
ఎన్టీఆర్ ఎప్పటికైనా శాలిని స్వగ్రామమైన కుందాపురానికి వెళ్లి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలని ఆమె కల. మొత్తానికి ఎన్టీఆర్ కుందాపురానికి వెళ్లి తన తల్లి కలను నెరవేర్చారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
సెప్టెంబర్ 2న అమ్మ పుట్టినరోజు కంటే ముందే ఆమె కల నెరవేర్చడం నేను ఆమెకు ఇచ్చే ఉత్తమ బహుమతి అని ట్వీట్ చేశారు.
హోంబలే ఫిలిమ్స్ (Hombale Films) అధినేత విజయ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasant Neel) నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty)తో కలిసి ఎన్టీఆర్ తన తల్లి స్వగ్రామం కుందాపురానికి వెళ్లారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఎక్స్ వేదికగా షేర్ చేసారు.