Sunday 13th September 2026
12:07:03 PM
Home > తాజా > మీ నేతృత్వంలో రాష్ట్రం మరింత వృద్ధి చెందాలి.. రేవంత్ కు చిరంజీవి విషెస్!

మీ నేతృత్వంలో రాష్ట్రం మరింత వృద్ధి చెందాలి.. రేవంత్ కు చిరంజీవి విషెస్!

revanth chiru

Chiranjeevi Wishes Revanth | తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా గురువారం నాడు ప్రమాణస్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. దీంతో తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కాంగ్రెస్ ప్రభుత్వానికి, సిఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇప్పటికే సిఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. తాజాగా మాజీ కేంద్ర మంత్రి, సినీ నటులు మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.

‘తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కి శుభాభినందనలు, మీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా.

అలాగే డిప్యూటీ సిఎం గా ప్రమాణ స్వీకారం చేసిన భట్టి విక్రమార్కకు, మంత్రివర్యులకు, సీఎల్పీ నేతలకు శుభాకాంక్షలు’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

You may also like
cm revanth speech
ఇది 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానం’: అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆగ్రహం!
మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం!
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions