Friday 4th October 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > వినాయక చవితి..ఏ సమయంలో విగ్రహాన్ని ప్రతిష్టించాలి..ఎప్పుడు చంద్రున్ని చూడొద్దు ?

వినాయక చవితి..ఏ సమయంలో విగ్రహాన్ని ప్రతిష్టించాలి..ఎప్పుడు చంద్రున్ని చూడొద్దు ?

Ganesh Chaturthi 2024 | మరికొన్ని గంటల్లో దేశ వ్యాప్తంగా గణనాథుడి వేడుకలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఊరు, వాడ పందిర్లు వేసి విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు పిల్లలు, పెద్దలు సకల ఏర్పాట్లు చేశారు.

‘ భాద్రపద శుద్ధ చవితి ‘ రోజున వినాయక చవితి ని జరుపుకుంటారు. కానీ ఈసారి సెప్టెంబర్ 6న మరియు 7న రెండు రోజుల పాటు చవితి తిథి ఉందని పండితులు చెబుతున్నారు.

అయితే ధృక్ సిద్ధాంతం ప్రకారం శనివారం రోజున వినాయక చవితి నిర్వహించుకోవలని చెబుతున్నారు. శనివారం ఉదయం 11.03 గంటల నుండి 1.30 గంటల మధ్య విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజలు చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

అలాగే సాయంత్రం 6.22 గంటల నుండి 7.30 గంటల మధ్య వరసిద్ధి వినాయక వ్రత కల్పము చేసుకోవచ్చని చెబుతున్నారు.

మరోవైపు చవితి నాడు చంద్రున్ని చూడకూడదని పెద్దలు చెబుతారు. సెప్టెంబర్ 6న రాత్రి 8 గంటల 16 నిమిషాల వరకు, సెప్టెంబర్ 7న శనివారం రాత్రి 8 గంటల 45 నిమిషాల వరకు చంద్రున్ని చూస్తే అశుభం అని వేద పండితులు పేర్కొన్నారు.

You may also like
మహాగణపతి శోభాయాత్ర..హుస్సేన్ సాగర్ వద్ద సీఎం రేవంత్
రికార్డు బద్దలుకొట్టిన బాలాపూర్ లడ్డూ..ఈ సారి ఎంత ధర పలికిందంటే !
వినాయకుడి లడ్డూ దొంగలున్నారు జాగ్రత్త
khairatabad ganesh 2024
ఈసారి ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఎత్తు ఎంతంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions