Monday 14th September 2026
12:07:03 PM
Home > తాజా > హైవే ను శుభ్రం చేసి, ట్రాఫిక్ క్లియర్ చేసి..శభాష్ పోలీసన్న

హైవే ను శుభ్రం చేసి, ట్రాఫిక్ క్లియర్ చేసి..శభాష్ పోలీసన్న

Traffic Police Cleans Highway | వాహనదారులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు చేసిన పనికి అందరూ సెల్యూట్ ( Salute ) చేస్తున్నారు.

చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ విజయవాడ ( Hyd-Vijayawada ) హైవే ( High Way ) పై రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంతో లారీల్లో ఉన్న బీరు సీసాలు, ఉల్లిగడ్డలు చెల్లాచెదురుగా రోడ్డుపై పడ్డాయి.

దింతో హైవే పై వెళ్తున్న వాహనాలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసులు రహదారిపై ఉన్న బీరుసీసా ముక్కలను శుభ్రం చేశారు.

చెట్టు కొమ్మల సాయంతో రోడ్డుపై పడిన గాజు ముక్కలను పక్కకు ఊడ్చేశారు. కాగా ట్రాఫిక్ ని క్లీయర్ ( Clear ) చేసిన విధానం పట్ల పోలీసుల పై వాహనదారులు ప్రశంసలు కురిపించారు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
దివ్యాంగుడి కలను నిజం చేసిన మల్కాజిగిరి సీపీ సుమతి!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions