Thursday 30th July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > బయట పేపర్ లీక్..పార్లమెంటు లోపల వాటర్ లీక్ : కాంగ్రెస్ ఎంపీ

బయట పేపర్ లీక్..పార్లమెంటు లోపల వాటర్ లీక్ : కాంగ్రెస్ ఎంపీ

Water Leak In New Parliament Building | నూతన పార్లమెంటు ( Parliament ) భవనంలో వర్షం నీరు లీక్ కావడం రాజకీయ దుమారం రేపుతోంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ( Central Vista Project )లో భాగంగా గతేడాది నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన విషయం తెల్సిందే.

కాగా గత కొన్ని రోజులుగా దేశ రాజధాని వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లాబీలో వాటర్ లీక్ ( Water Leak ) అవుతున్న వీడియోను కాంగ్రెస్ ఎంపీ మానిక్కం ఠాగూర్ ( Manickam Tagore ) ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

బయట పేపర్ లీక్..లోపల వాటర్ లీక్ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి వినియోగించిన పార్లమెంటు లాబీలో వాటర్ లీక్ అవ్వడం నూతన భవనంలోని సమస్యలను ఇది చెబుతోందని మానిక్కం ఠాగూర్ పేర్కొన్నారు.

ఈ ఘటనపై పార్లమెంటులో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు వాటర్ లీక్ ఘటనపై యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ ( Akhilesh Yadav ) యాదవ్ స్పందించారు.

బీజేపీ హయాంలో అద్భుతంగా ఆలోచించి నిర్మించిన ప్రతి నిర్మాణం నుండి నీరు లీక్ అవుతుందా అని ప్రజలు అడుగుతున్నారని అఖిలేష్ ఎద్దేవా చేశారు.

You may also like
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions